telugu navyamedia
సినిమా వార్తలు

“గేమ్ ఓవర్” మేకింగ్ వీడియో

Game-Over

2015లో నయనతార ప్రధాన పాత్రలో నటించిన తమిళ హార్రర్ థ్రిల్లర్ “మాయ”. అప్పట్లో విడుదలైన ఈ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ హార్రర్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులను “మయూరి”గా అలరించింది. ఈ సినిమాకు అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించి, టాలెంటెడ్ దర్శకుడిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ దర్శకత్వంలో తమిళంలో “గేమ్ ఓవర్” అనే మరో హారర్ థ్రిల్లర్ తెరకెక్కింది. ఈ చిత్రంలో తాప్సీ ప్రధానపాత్రను పోషించింది. జూన్ 14న “గేమ్ ఓవర్” ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. అంతేకాదు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. ఈ చిత్రంతో ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేసిన తాప్సి ఆ తరువాత తెలుగులో మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా “గేమ్ ఓవర్” చిత్రానికి సంబంధించిన 2 నిమిషాల మేకోవర్ వీడియోను విడుదల చేశారు చిత్రబృందం. ఈ వీడియోను మీరు కూడా వీక్షించండి.

Related posts