పుణేలోని తిలక్ రోడ్డుపై ఓ యువతి మద్యం తాగి రచ్చ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. హీరాబాగ్ చౌక్ వద్ద రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్వర్గేట్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫోన్ రావడంతో.. అక్కడికి వెళ్లే సరికి ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయిందన్నారు.
కాగా మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాసేపు రోడ్డుపై ఊగుతూ, తూలుతూ హంగామా చేసిన ఆ యువతి… ఆ తర్వాత రోడ్డు మధ్యలో పడుకుంది. దాంతో ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది. ఈ వీడియోపై ఓ నెటిజన్ రకరకాలు స్పందిస్తున్నారు.
Drunk woman enjoying her life in between the traffic on the road in Pune 😁 #Tipsy pic.twitter.com/UOVConGQO9
— QueenBee (@VaidehiTaman) August 4, 2021