telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“12’O Clock” అంటూ టీజర్ తో భయపెడుతున్న వర్మ

12 O Clock

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎవ్వరూ ఊహించని విధంగా 12’O Clock మూవీ ప్రకటించారు. అంతేకాదు ఆ సినిమా టీజర్ కూడా రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచారు. ఈ లాక్‌డౌన్ వేళ ఒక్కో దర్శకనిర్మాత సినిమాలు ఎలా షూట్ చేయాలి? అని ప్లాన్ చేస్తుండగానే తాను అందరిలో డిఫరెంట్ అని మరోసారి నిరూపిస్తూ రామ్ గోపాల్ వర్మ ఇలా వరుస సినిమాలను ప్రకటిస్తుండటం విశేషం. ఇక 12’O Clock మూవీ టీజర్ విషయానికొస్తే.. ఒక నిమిషం 47 సెకనుల నిడివితోనే అందరినీ భయపెట్టేశారు వర్మ. ఈ వీడియోలో చూపించిన సన్నివేశాలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై ఆసక్తి రేకెత్తించాయి. దీంతో టీజరే ఇలా ఉంటే మరి సినిమా ఎలా ఉండబోతోంది? అని అంచనా వేస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఈ మూవీ ఈ మధ్య వర్మ రిలీజ్ చేసిన ‘క్లైమాక్స్, నగ్నం’ లాగా షార్ట్ ఫిలిం కాదు. ఫుల్ లెంగ్త్ సినిమా. ఈ విషయాన్ని వర్మ ప్రకటిస్తూ.. 12’O Clock మూవీతో 1 గంట 45 నిముషాలు భయపెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండటం స్పెషల్ అట్రాక్షన్.

Related posts