telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు

రైల్వే, బి.హెచ్.ఈ.ఎల్ లో .. పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్..

jobs notifications from diff dept.s

రైల్వే లో .. ఒప్పంద ప్రాతిపదికన భర్తీకి .. నోటిఫికేషన్…
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు : 100 ఉన్నాయి.

ఉద్యోగాలు : వర్క్స్ ఇంజినీర్, జియాలజిస్ట్, సీనియర్ వర్క్స్ ఇంజినీర్, సైట్ సూపర్వైజర్, సీనియర్ సైట్ సూపర్‌వైజర్.
విద్యార్హత : సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఇంజినీరింగ్ లేదా ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి .

అనుభవం, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎన్నుకుంటారు.

దరఖాస్తు విధానం .. ఆన్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది.

అప్లయ్ చేయడానికి చివరితేదీ : జనవరి 21, 2020.

మరిన్ని వివరాల కోసం https://ircon.org/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.


బి.హెచ్.ఈ.ఎల్ లో .. పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్..
బీహెచ్ఈఎల్‌ సంస్థ పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అందుకు గాను మొత్తం 300 పోస్టుల్ని ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో గల బీహెచ్ఈఎల్ యూనిట్‌లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి. బీహెచ్ఈఎల్‌లో అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 20 చివరి తేదీ.

మొత్తం ఖాళీలు- 300

ట్రేడ్ అప్రెంటీస్- 260
ఫిట్టర్- 85
టర్నర్- 10
మెషినిస్ట్- 10ఎలక్ట్రానిక్ (మెకానిక్)- 10
ఎలక్ట్రీషియన్- 80
వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రానిక్)- 25
డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానిక్)- 10
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA)- 18
ప్లంబర్- 6
కార్పెంటర్- 6
టెక్నీషియన్ / గ్రాడ్యుయేట్ అప్రెంటీస్- 40
ఎలక్ట్రికల్- 10
టెక్నికల్- 10
ఎలక్ట్రానిక్స్- 9
ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్- 2
సివిల్- 2
కంప్యూటర్ అప్లికేషన్- 3
మోడర్న్ ఆఫీస్ మేనేజ్‌మెంట్ అండ్ సెక్రెటేరియల్ / ప్రాక్టీస్- 2
ఫార్మసీ అసిస్టెంట్- 2

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 31

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 20

డాక్యుమెంట్లు పంపడానికి చివరి తేదీ- 2020 జనవరి 25 సాయంత్రం 5 గంటలు

విద్యార్హత- ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులకు 12వ తరగతి లేదా ఐటీఐ. టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు డిప్లొమా లేదా డిగ్రీ పాస్ కావాలి.

వయస్సు- కనీసం 18 నుంచి 27 ఏళ్లు.

Related posts