telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“డియర్ కామ్రేడ్” ప్రీమియర్ షో టాక్

Dear-Comrade

సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్‌ బ్యాన‌ర్స్‌లో రూపొందిన ఎమోష‌న‌ల్ డ్రామా “డియ‌ర్ కామ్రేడ్‌”. “యు ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌” ట్యాగ్ లైన్‌. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా నటించింది. “డియర్‌ కామ్రేడ్‌” సినిమాలో హీరోయిన్ ర‌ష్మికా మంద‌న్న‌ క్రికెట‌ర్‌గా న‌టించింది. సామాజిక బాధ్య‌త ఉన్న ఇన్‌టెన్సివ్ పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ మెప్పించ‌నున్నారు. ఈ చిత్రానికి జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్‌ సంగీతం అందించగా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. “డియర్ కామ్రేడ్‌” ఈ నెల 26న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శృతి రామచంద్రన్, సుహాస్, చారు హాసన్, ఆనంద్ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈరోజు గ్రాండ్ గా విడుదలైంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ అన్ని భాషల్లో తనదైన శైలిలో ప్రమోషన్లు చేస్తూ సినిమాపై అంచనాలను పెంచేశాడు. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగింది.

అమెరికాలో ఇప్పటికే ప్రీమియర్ షోలను ప్రదర్శించడంతో సినిమా టాక్ బయటకొచ్చింది. సినిమా చూసిన వారు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరు సినిమాపై పాజిటివ్ గా స్పందిస్తుంటే… మరికొందరు మాత్రం ఒకసారి మాత్రమే చూడగలిగే సినిమా అని అంటున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ లో విజయ్, రష్మికల లవ్ ట్రాక్ బాగున్నప్పటికీ నేరేషన్ కాస్త నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుందని, రష్మిక క్రికెటర్ గా ఎంట్రీ ఇచ్చే సన్నివేశాలు సినిమాకు ప్లస్ అని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా పరవాలేదని, సెకండ్ హాఫ్ లో విజయ్ ఒక బైక్ ట్రిప్ తో దేశం మొత్తం శాంతిని వెతుక్కుంటూ తిరిగే సన్నివేశాలు యూత్ కి కనెక్ట్ అవుతాయని, ‘కడలల్లే’ పాట అధ్బుతంగా ఉందని చెబుతున్నారు. సినిమాలో పెద్దగా సర్ప్రైజ్ లు లేకపోవడం, నేరేషన్ స్లోగా సాగడం, నిడివి ఎక్కువ అవ్వడం సినిమాకు మైనస్ పాయింట్లు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు, నేపధ్య సంగీతం బాగున్నాయి. టెర్రిఫిక్, రియలిస్టిక్, ఎమోషనల్ లవ్ స్టోరీ “డియర్ కామ్రేడ్” విజయ్ ఫ్యాన్స్ ను మెప్పిస్తుందని టాక్.

Related posts