telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

క్రిస్ గేల్ .. 10వేల పరుగుల మైలురాయి.. 500 సిక్సులు..

chris gale 10000 runs mile stone

క్రికెట్ దిగ్గజం, వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్‌.. వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని దాటేశాడు. సెయింట్ జార్జ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ 162 రన్స్ చేశాడు. గేల్‌కు ఇది 25వ వన్డే సెంచరీ. 39 ఏళ్ల గేల్ అంతర్జాతీయ క్రికెట్‌లో 500(3 ఫార్మాట్లు) సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా కూడా రికార్డు క్రియేట్ చేశాడు.

వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని దాటిన 14వ బ్యాట్స్‌మెన్‌గా చరిత్రకెక్కాడు. ఈ ఘటన సాధించిన రెండవ విండీస్ ప్లేయర్‌గా నిలిచాడు. గతంలో వన్డేల్లో పది వేల పరుగుల చేసిన ప్లేయర్లలో బ్రియాన్ లారా ఉన్నాడు. అయితే వన్డేల నుంచి ప్రపంచ కప్ తర్వాత రిటైర్‌కానున్నట్లు గేల్ చెప్పిన విషయం తెలిసిందే.

Related posts