telugu navyamedia
ట్రెండింగ్

చెలీ!కుశలమా!!

latangi poetry corner
అక్కడ నువ్వు కుశలమా!చెలీ!
ఇక్కడ నేనూ కుశలమే సఖీ!
అనురాగదేవతవై నా ఎదుట నిలిచావు
ప్రేమామృతాన్ని 
నాగుండె కుండలో పోసావు
మనసు మ్రానుపై వసంతకోకిలవై 
వచ్చి నిలిచి
వలపుల గీతాలు ఆలపించావు
నా హృదయం భూభ్రమణమై 
నీచుట్టునే తిరుగుచున్నది
నీ చిలిపిచూపులు
అయస్కాంత తరంగాలై 
నామనసునే లాగుచున్నవి
కన్నులు మూసినా, తెరిసినా 
నీదివ్య రూపం
కనుపాపలా కదలుచున్నది
నీవు చేసిన బాసలు,
నీవు చెప్పిన ఊసులు
నీవు రాసిన ప్రేమాక్షరాలు
నా మనసును కుదురుగా 
ఉండనివ్వడంలేదు
అందుకే సీతాకోకచిలుక చేత
 ‘ప్రేమ సందేశం’ పంపుతున్నాను
పంచభూతాలను ప్రేమ సాక్షులుగా నియమించుచున్నాను
సఖీ! ప్రేమకు గుర్తుగా
శాశ్వత ప్రేమ ఆనవాలు పంపావా!!
నీ చల్లని ప్రేమ కబురుకై విరహ విహంగమై ఎదురు చూస్తూ…
-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

Related posts