telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

అక్కడ అత్యాచారాలు .. యథేచ్ఛగా చేసుకోవచ్చట.. !

women gang raped in capital of india

ఒక యువకుడు 17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేశాడు. ఆమె నుంచి విషయం తెలుసుకున్న మిగతావారు ఆ కుర్రాడిని బంధించి పోలీసులకు అప్పగించారు. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతన్ని ధర్మాసనం ముందు నించోబెట్టారు. వివరాలు తెలుసుకున్న జడ్జి.. ఆ కుర్రాడిని శిక్షించడం కుదరదని తేల్చాడు. నమ్మలేని విధంగా ఉన్నా ఇది నిజమే.

ఇది జరిగింది స్పెయిన్‌లో. ఓ క్రూయిజ్ షిప్‌లో ప్రయాణిస్తున్న అమ్మాయిని బలవంతంగా తన కేబిన్‌లోకి తీసుకెళ్లిన యువకుడు ఆమెను బలాత్కరించాడు. విషయం తెలుసుకున్న సిబ్బంది.. ఓడ స్పెయిన్‌లో ఆగగానే అతన్ని పోలీసులకు పట్టించారు. నిందితుడికి శిక్ష వేయడం కుదరదన్న న్యాయమూర్తి.. ‘ఓ బ్రిటన్ యువతిపై ఇటాలియన్ యువకుడు.. పనామా దేశానికి చేరువలో అంతర్జాతీయ జలాల్లో ఈ చర్యకు పాల్పడ్డాడు. అతన్ని స్పెయిన్ చట్టాల ప్రకారం శిక్షించలేం. ఈ విషయం మా పరిధిలో లేదు’ అని వ్యాఖ్యానించారు. దాని తో అతన్ని పోలీసులు వదిలిపెట్టేశారు.

Related posts