telugu navyamedia
telugu cinema news trending

గర్భం దాల్చిన విషయం ఎవరికీ చెప్పలేదు…! నేహా ధుపియా

Neha

ముంబైలో ఏర్పాటు చేసిన ‘ప్రెగతాన్’ వాక్‌లో నేహా ధుపియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేహా తాను తల్లి కాబోతున్నప్పుడు పడిన కష్టాల గురించి వెల్లడించారు.‘‘నేను దాదాపు పదిహేనేళ్ల పాటు నచ్చింది తినకుండా నోరు కట్టేసుకున్నాను. అందుకే గర్భం దాల్చినప్పుడు ఇష్టం వచ్చింది తినేసాను. అలాగని తిని కూర్చోలేదు. బాగా వ్యాయామం చేసాను. ఫిట్‌గా ఉన్నాను. గర్భం దాల్చినప్పటికీ నేను ఉదయాన్నే లేచి సెట్స్‌కు వెళ్లిపోయేదాన్ని. ఆ లైఫ్ చాలా ఎంజాయ్ చేసాను. అయితే నేను పనిలో ఉన్నప్పుడు తిండి విషయంలో నోరు కట్టేసుకుని కూర్చోలేదు. నేను చాలా రోజుల వరకు గర్భం దాల్చిన విషయం ఎవ్వరికీ చెప్పలేదు. కానీ సెట్‌లో ఉన్నప్పుడు నచ్చిన ఫుడ్ తినేస్తుంటే చాలా మందికి డౌట్ వచ్చింది. ఏంటి ఎప్పుడూ లేనిది ఇలా తినేస్తున్నావ్ అని అడిగేవారు. అప్పుడు నేను నాకు తినాలనిపించింది కాబట్టి తింటున్నాను అని చెప్పేదాన్ని. గర్భిణులకు నేను ఒక్కటే చెప్పాలని అనుకుంటున్నాను. మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీకు నచ్చిందే చేయండి. ప్రెగ్నెంట్ అయినంత మాత్రాన జీవితంలో అన్ని విషయాలను మార్చేయాలని అనుకోవద్దు’ అన్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అంగద్ బేడీతో డేటింగ్‌లో ఉన్నప్పుడే నేహా తల్లయ్యారు. దాంతో వెంటనే ఇంట్లో వారికి విషయం చెప్పి రహస్యంగా పెళ్లి చేసేసుకున్నారు.

Related posts

కారును మంచినీళ్ళతో శుభ్రం.. కోహ్లీసేనకు చలాన్ ..: లండన్ మున్సిపల్ ఇంజనీర్

vimala p

“రౌడీ” బ్రాండ్ పై అమెజాన్ కు కోర్టు ఆదేశం

ashok

చిరు సినిమాలో చరణ్ పాత్ర ఇదే…?

vimala p