telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు సామాజిక

బంకమన్ను ‘తింటే’ .. ఊబకాయానికి శాశ్వత పరిష్కారం : పరిశోధకులు

black clay and health secretes

మన తాత-ముత్తాతల కాలంలో వంటింట్లో అన్ని మట్టి పాత్రలే ఉండేవి. వంట వండినా, దానిని తిన్నా కూడా మట్టి పాత్రలలోనే. ఇక అప్పటి వారి ఆరోగ్య రహస్యం వారు తీసుకునే తిండితో పాటుగా ఆయా పాత్రలలో కూడా ఉందని పరిశోధకులు చెపుతున్నారు. ఆ కాలంలో వంటిళ్ళలో మట్టిపాత్రలే కనిపించేవి. కుండలో నీరు తాగేవారు. మట్టి పాత్రల్లో వండిన అన్నం, కూర తినేవారు. వెనుకటి రోజుల్లో ఇదే వారి లైఫ్ స్టైల్. అందుకే ఆ కాలం మనుషులు ఎంతో దృఢంగా ఉండేవారని పరిశోధకులు అంటున్నారు. ఇలాంటి పాత్రలు ఇపుడు మచ్చుకైనా కనిపించడం లేదు.

బంకమట్టితో తయారు చేసిన పాత్రలో ఆహారం తింటేనే మనిషి అంత ఆరోగ్యంగా ఉంటే.. బంకమట్టినే తింటే ఎలా ఉంటాడు అనే ఆలోచనతో పరిశోధకులు అధ్యయనం చేశారు. ఎలుకలపై చేసిన పరిశోధనలో కొవ్వుపట్టి ఉన్న ఎలుకలు బంకమట్టి తినడంతో సన్నబడ్డాయని తేలింది. దీనితో మనిషి పరిశోధన చేసిన బంకమట్టి తినడంతో శరీరానికి మేలని, బంకమట్టి తింటే పొట్ట తగ్గుతుందని యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు తెలిపారు. మరీ.. పొట్ట తగ్గుతుందని వెంటనే బంకమట్టిని తినవద్దని.. పరీక్షలు చేసిన బంకమట్టిని మాత్రమే తినాలని సూచించారు. సైంటిస్టులు ప్రత్యేకంగా తయారు చేసిన బంకమట్టికే అది సాధ్యం అని తెలిపారు.

తమ పరిశోధనలలో భాగంగా, తొలుత కొన్ని ఎలుకలకు ఒబేసిటీ మెడిసిన్, కొన్ని ఎలుకలకు ప్రాసెస్డ్‌ బంక మట్టిని అందజేశారు. ఇలా రెండు వారాలపాటు వారు అధ్యయనం కొనసాగించారు. డ్రగ్‌ తీసుకున్న ఎలుకలలో కంటే మట్టి తిన్న వాటిలో బరువు తగ్గడం స్పష్టంగా కనపడినట్లు గుర్తించారు. పైగా, బంకమట్టి తిన్న ఎలుకలలో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనబడలేదని, అవి ఆరోగ్యంగా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ బంకమట్టిలోని సన్నటి మురికి లాంటి పదార్థం పేగుల్లోని కొవ్వును పీల్చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు శాస్త్రవేత్తలు. దీన్ని మనుషులపై ప్రయోగించడానికి తమ అధ్యయనం ఇంకా కొనసాగిస్తున్నామని వారు వెల్లడించారు.

Related posts