telugu navyamedia
telugu cinema news

అర్జున్ సురవరం : ఆకట్టుకుంటున్న “బ్యాంగ్ బ్యాంగ్…” లిరికల్

Arjun-Suravaram

యంగ్ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం “అర్జున్ సురవరం”. ఈ చిత్రంలో జర్నలిస్ట్ గా నటిస్తున్నారు నిఖిల్. టిఎన్ సంతోష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన లభిస్తోంది. స్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, నాగినీడు, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర ఈ చిత్రంలో స‌హాయ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఔరా సినిమాస్ పివిటి, మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్పి బ్యాన‌ర్స్ పై కావ్య వేణుగోపాల్, రాజు కుమార్ నిర్మిస్తున్నారు. బి మ‌ధు అర్జున్ సురవరం చిత్రాన్ని స‌మ‌ర్పిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి “బ్యాంగ్ బ్యాంగ్..” అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ పాటను సామ్ సిఎస్ ఆలపించారు. మీరు కూడా ఈ లిరికల్ వీడియోపై ఓ లుక్కేయండి మరి.

Related posts

కేంద్ర ప్రభుత్వం కొత్త విద్యా విధానంపై సూర్య వ్యాఖ్యలు… వివాదాస్పదం

vimala p

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ

vimala p

ఊర్మిళపై కంగనా వ్యాఖ్యలు… రామ్ గోపాల్ వర్మ రియాక్షన్…!

vimala p