telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కేసీఆర్ తో సినిమా తీయాలని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్న…

ఈడబ్ల్య్యూ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం తో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని సన్మానించరు అగ్రవర్ణ సంఘాల ప్రతినిధులు. అక్కడ బండి సంజయ్ మాట్లాడుతూ… అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండేళ్ల క్రితమే మోడీ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ నటించడం లో జీవిస్తాడు.. రాఘవేంద్రరావు కి విజ్ఞప్తి చేస్తున్న ఆయన తో సినిమా తీయాలని ఆయనను జోకర్ గా పెట్టి సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుంది.. దగుల్బాజీ గాళ్ల రాష్ట్రాల్లో తప్ప అన్ని రాష్ట్రాల్లో ews రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి.. ఈ రెండేళ్లలో పేద విద్యార్థులకు జరిగిన అన్యాయానికి సీఎం బాధ్యత వహించి, ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. సీఎం కండ కావరం తో ఇప్పటి వరకు నాన్చి ప్రజలు తిరగబడతారని అమలు చేస్తా అంటున్నారు.. ప్రకటన లకే పరిమితము కాకుండా ews రిజర్వేషన్లు అమలు చేయాలి.. ఎవరి రిజర్వేషన్లు తగ్గవు.. అన్ని కుల సంఘాలు సహకరించాలి.. సీఎం చిచ్చు పెట్టె ప్రయత్నం చేస్తాడు… కేసీఆర్ ని ముఖ్యమంత్రి ను చేసినందుకు తెలంగాణ ప్రజలు ఇళ్లలో దోష నివారణ పూజలు చేయాలి మళ్ళీ ఎన్నికలకు సిద్ధం గా.. నీకు చేతకానిది ని కొడుకుతో అయితద అన్నారు. కేటీఆర్ సీఎం చేయడాన్ని మీ ఎమ్మెల్యే లే ఒప్పుకోరు.. మంత్రి వర్గం ఏర్పాటు అయితే ని పార్టీ లో అణుబాంబు పేలడం ఖాయం.. పీఆర్సీ విషయం లో, ews రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేస్తే మెడలు వంచి అమలు చేయిస్తాం..  ముఖ్యమంత్రి వ్యాక్సిన్ వేరే ఉంటుంది.. మోడీ వాక్సిన్ కి trs వ్యాక్సిన్ కి తేడా ఉంటుంది అన్నారు.

Related posts