telugu navyamedia
telugu cinema news trending

అనుష్క “నిశ్శబ్దం” విడుదల మరింత ఆలస్యం…!

Silence

హేమంత్ మధుకర్ దర్శక‌త్వంలో అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రధారులుగా “నిశ్శబ్దం” అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర నిర్మాత‌లు టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, వివేక్ కూచిభోట్ల‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, ఇంగ్లీషు, హిందీతో పాటు మ‌ల‌యాళంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలినీ పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో కూడా నటిస్తున్నారు. అనుష్క నటిస్తోన్న “నిశ్శబ్ధం” చిత్రాన్ని మిగతా భాషల్లో “సైలెన్స్” పేరుతో విడుదల చేయనున్నారు. న‌వంబ‌ర్ 7న‌ అనుష్క పుట్టిన‌రోజు సంద‌ర్భంగా `నిశ్శ‌బ్దం` టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా “నిశ్శబ్ధం” సినిమాను జనవరి 31, 2020 విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే, విడుదల తేదీ మారుతున్నట్టు తాజాగా వార్తలు వచ్చాయి. సాంకేతిక కార‌ణాల‌తో సినిమాను ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. అయితే సినిమా విడుద‌ల మ‌రింత ఆల‌స్య‌మ‌య్యేలా ఉంది. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఏప్రిల్‌లో విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

Related posts

మరికొంత సమయం పడుతుంది… రూమర్స్ నమ్మొద్దు : డైరెక్టర్ మారుతీ

vimala p

తప్పా… ఒప్పా… ? అనేది పక్కన పెడితే… చావును వాళ్లే కొని తెచ్చుకున్నారు : రేణూ దేశాయ్

vimala p

ఏపీ ఎమ్మెల్యేలకు .. శిక్షణ ప్రారంభం..

vimala p