telugu navyamedia
సినిమా వార్తలు

త్వరలో “ఎఫ్-3″… వరుణ్, వెంకీలతో రవితేజ

f2

వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన “ఎఫ్-2” ఈ నెల 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సక్సెస్ టాక్ తో దూసుకెళ్తోంది. పూర్తి హాస్యభరితంగా నిర్మితమైన ఈ సినిమా వసూళ్ల పరంగా రికార్డు సృష్టిస్తోంది. దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మింతమైన ఈ చిత్రం ఇప్పటికి రూ.70 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. తొలివారమ ప్రపంచవ్యాప్తంగా రూ.61.43 కోట్లు వసూలు చేసింది. ఇక అమెరికా బాక్సాఫీస్ వద్ద 2 మిలియన్ డాలర్ల దిశగా దూసుకెళ్తోందని చిత్రబృందం తెలిపింది.

ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ నటనకు మంచి మార్కులు పడగా తమన్నా, మెహ్రీన్ లు తమ గ్లామర్ తో సినిమాకు ప్లస్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సీక్వెల్ గా “ఎఫ్ 3” ఉంటుందని అనిల్ రావిపూడి, వరుణ్ తేజ్ అన్నారు. ఈ సీక్వెల్ లో వెంకటేశ్, వరుణ్ తేజ్ లతోనే రానుందని, అయితే కొత్తగా ఈ ఇద్దరికీ రవితేజ తోడవుతాడని అంటున్నారు. “రాజా ది గ్రేట్” ఈ సినిమాలోలాగే రవితేజ ఈ సినిమాలో కూడా అంధుడిగా కనిపిస్తాడని అంటున్నారు. మరి ఇది ఎంత మేరకు నిజమో తెలియాలంటే చిత్రబృందం అధికారికంగా ప్రకటించే వరకు ఎదురు చూడాల్సిందే.

Related posts