telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నెటిజన్ కు అనసూయ స్ట్రాంగ్ కౌంటర్

Anasuya

అనసూయ తెలుగు బుల్లితెరపై టాప్‌ యాంకర్‌గానే కాకుండా సినిమాల్లో కూడా ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది అనసూయ. ఇక నిన్న అనసూయ పుట్టిన రోజు సందర్భంగా ఉదయం పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అనసూయ సాయంత్రం అభిమానులతో చిట్‌ చాట్‌ చేద్దామని ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చింది. సాదారణంగా ఇంట్లో ఉంది కాబట్టి తనకు సౌకర్యంగా ఉండే కాస్త మాడ్రన్‌ బట్టలు వేసుకుని ఉంది అనసూయ. అలా తన అభిమానుల ప్రశ్నలకు సమాదానమిస్తూ చిట్‌ చాట్‌ చేస్తున్న అనసూయకు ఓ పోకిరీ చిరాకు తెప్పించేసాడు. ఆ నెటిజన్ అనసూయను పిల్లల తల్లివి నీ బట్టలు ఏంటి అని అన్నాడు. అంతే వెంటనే నేను ఏ బట్టలు వేసుకుంటే నీకేంట్రా, నువ్వు ఎవడ్రా నాకు చెప్పడానికి అని అనసూయ అతనికి గట్టిగానే చివాట్లు పెట్టింది.

Related posts