telugu navyamedia
news telugu cinema news

నాగ చైతన్య తర్వాతి సినిమా అతడితోనేనా..?

హీరో నాగచైతన్య. ఎప్పటికప్పుడు కొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. చైతన్య ఇటీవల శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్‌స్టోరీ సినిమాను ముగించుకున్నారు. ఈ సినిమా ఏప్రిల్16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పోస్టర్ అన్ని కూడా మంచి స్పందన అందుకున్నాయి. ఈ సినిమా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగచైతన్య థాంక్యూ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ముగ్గురు భామలతో చైతూ రొమాన్స్ చేయనున్నారు. అయితే ప్రస్తుతం థాంక్యు సినిమా తరువాత చైతు ఎవరితో సినిమా చేస్తారని సందేహాలు వస్తున్నాయి. అయితే నాగచైతన్య థాంక్యు సినిమా తరువాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేయనున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌లో సంచలనాలు సృష్టించిన సినిమా ఉప్పెన. రిలీజ్ అయిన అతి తక్కువ సమయంలోనే ఎన్నో రికార్డులను తిరగరాసిందీ సినిమా. ఇక చైతన్య-బుచ్చిబాబు కాంబినేషన్ లో నిజం ఎంతవరకు ఉందనేది తెలియాలంటే కాస్త సమయం ఎదురుచూడాల్సిందే.

Related posts

శ్రీలంక పేలుళ్లలో ఇద్దరు జేడీఎస్‌ నేతల మృతి

vimala p

టూల్‌కిట్‌ కేసును లోతుగా విచారిస్తున్న ఢిల్లీ పోలీసులు…

Vasishta Reddy

గల్లీబాయ్ నుండి.. ముఖ్యమైన సన్నివేశం కట్ చేసేసిన సెన్సార్ .. నిరుత్సహంలో.. !!

vimala p