telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“రంగస్థలం” తమిళ రీమేక్… హీరో ఎవరంటే ?

Rangasthalam

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా, సమంత హీరోయిన్ గా నటించిన “రంగస్థలం” ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసుకుందో అందరికీ తెలిసిన విషయమే. రంగ‌స్థ‌లం చిత్రం బాక్సాఫీస్ దగ్గ‌ర దాదాపు 200 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ళు సాధించిన విష‌యం తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలిచిన చిత్రం ‘రంగ‌స్థ‌లం’. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొంద‌డ‌మే కాక బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఇక ఈ సినిమాను కన్నడ, మలయాళంలో డబ్ చేసారు. ఇక ఈ సినిమా తమిళ్ లో రీమేక్ చేయబోతున్నారు. రాంచరణ్ నటించిన చిట్టిబాబు పాత్రను ప్రముఖ కొరియోగ్రాఫర్ యాక్టర్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ పోషిస్తాడని సమాచారం. అందులో భాగంగానే ఈ చిత్ర తమిళ రీమేక్ హక్కులను రాఘవ లారెన్స్ పొందినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక సమంత నటించిన రామలక్ష్మి పాత్రలో నిక్కీ గల్రాని నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక తెలుగులో ఘనవిజయం సాధించిన ఈ సినిమాను తమిళ్ లో ఎలా తెరకెక్కిస్తారన్న ఆసక్తి నెలకొంది.

Related posts