టాలీవుడ్‌లో ‘బస్ స్టాప్’, ‘ఈ రోజుల్లో’ వంటి చిత్రాల్లో నటించింది ఆనంది. ఆ తర్వాత తెలుగులో సక్సెస్ కాలేకపోయింది. దీంతో, తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించింది. అక్కడ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదే సమయంలో తమిళ అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్ తో ప్రేమలో పడింది. ఈ జనవరి 7న పెద్దల అంగీకారంతో వరంగల్లో సోక్రటీస్ తో వివాహం జరిగింది. త్వరలోనే ఆమె తల్లి కాబోతోంది. ప్రస్తుతం ఆమెకు ఆరో నెల అని తెలుస్తోంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆనంది నటించిన రెండు తెలుగు సినిమాలు ఆమె పెళ్లి తర్వాత విడుదలయ్యాయి. వాటిలో ఒకటి ‘జాంబిరెడ్డి’ కాగా… మరొకటి ‘శ్రీదేవి సోడా సెంటర్’. కాగా ఈ సినిమా ప్రమోషన్ లో కాని, ఫ్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఎక్కడ ఆమె కనిపించక పోవడాని ఇదే కారణమట.
ప్రభాస్‌పై సంజన గల్రానీ ఆసక్తికర వ్యాఖ్యలు..