telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టార్ హీరో రొమాంటిక్ పిక్… ప్రియుడితో…!?

Ira-Khan

బాలీవుడ్ స్టార్ హీరో, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ కొన్నాళ్ళుగా మ్యూజిషియన్ మిశాల్ కిర్ప‌లానితో డేటింగ్‌లో ఉన్నారన్న విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రి ప్రేమాయ‌ణం గురించి కొన్నాళ్ళుగా మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇరా ఖాన్‌కు సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన హాట్ హాట్ ఫోటోలతో చాలా మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. వారు అడిగే ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు చెబుతుంటుంది. కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తి ఇరాను.. “ప్రస్తుతం మీరు ఎవరితో డేటింగ్ చేస్తున్నారు?” అని ప్రశ్నించారు. దీనికి ఇరా వెంటనే “మిశాల్ కృపలాని” అని చెప్పి షాకిచ్చింది. అంతటితో ఆగకుండా తన బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. తాజాగా మరోసారి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉన్న ఫోటోను ఇరా పోస్ట్ చేసింది. మిశాల్, తను కలిసి ఉన్న ఒక రొమాంటిక్ పిక్‌ను పోస్ట్ చేసింది. దానికి “ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే” అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక యాక్టింగ్ తనకు ఇష్టం లేదని ఆమె తన తండ్రి అమీర్ ఖాన్ ను తెలపడంతో… ఆమె కెరీర్ ను ఆమె ఇష్టానికే వదిలేసినట్లు గతంలో ఆమె సన్నిహితులు వివరణ ఇచ్చారు. అయితే మొత్తానికి ఇరా ఖాన్ దర్శకత్వం శాఖలోకి వచ్చేసింది. థియేటర్ ప్రొడక్షన్ లో యూరిపిడెస్ మెడియా అనే ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్ ని రెడీ చేసుకుంది. ఇప్పటికే కొన్ని వర్క్స్ షాప్స్ నిర్వహించిన బేబీ ఇక ప్రాజెక్ట్ ని వీలైనంత త్వరగా ఫినిష్ చేసి డిసెంబర్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి దర్శకురాలిగా ఇరా ఖాన్ భవిష్యత్తులో తండ్రిని కూడా డైరెక్ట్ చేస్తుందో లేదో చూడాలి.

Related posts