telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు సాంకేతిక

నిజాంపేట్‌ : … ఐదేళ్ల బాలుడు రూపొందించిన.. పోషకాహార యాప్..

5 years boy developed app on food

బలమేధావి అనిపించుకుంటున్నారు రేపటి తరం. చిన్నవయసులోనే అద్భుతాలు సాధిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా యేడేళ్ల బాలుడు పిల్లల ఆహారంలో పోషకాహారం గుర్తించేలా యాప్‌ను రూపొందించాడు. కూకట్‌పల్లికి చెందిన సిద్ధాంత్‌ నాయర్‌ బాచుపల్లిలోని అంబీషస్‌ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. వైట్హాట్‌ జూనియర్‌ ఫ్టాట్‌పామ్‌లో రూపొందింనబడిన బాక్స్‌ప్లానర్‌ను రూపొందించాడు. దీంతో పిల్లలు ఆరోగ్యకరమైన సమతుల్య భోజనం తినేందుకు ఉపయోగపడుతుంది. అంబీటస్‌ వరల్డ్‌ స్కూల్‌ పిల్లల కోసం ఆరోగ్యకరమైన టిఫిన్‌ విధానాన్ని అనుసరిస్తుంది. 5 నెలలుగా వైట్హార్ట్‌ జూనియర్‌ ఫ్లాట్‌ఫామ్‌పై అభ్యాసాన్ని పిల్లలకు నిర్వహిస్తుండగా సిద్ధాంత్‌ నాయర్‌ తన ప్రతిభ ద్వారా చిన్నారులకు పోషకాహారం అందించేందుకు ఉపయోగపడే యాప్‌ను రూపొందించాడు.

ఈ సంధర్బంగా వైట్హార్ట్‌ జూనియర్‌ వ్యవస్థాపకుడు, సీఈవో కరణ్‌ బజాజ్‌ మాట్లాడుతూ పిల్లలు ఈ కాలంలో ఏది సరైందో, ఏది తప్పో తెలుసుకునే స్థాయిలో ఉన్నారని సమాజంలోని సమస్యలను పరిష్కరించేందుకు సొంతమార్గంలో ప్రయత్నాలు మొదలుపెడుతున్నారన్నారు. సిద్ధాంత్‌ లాగా చాలా మంది పిల్లలు సృజనాత్మకంగా ఆలోచించడం, అధిక యుటిలిటీ డిజిటల్‌ అనువర్తనాలను సృష్టించడం మనం చూస్తునే ఉన్నామన్నారు. ఇలాంటి సంఘటనలు ప్రపంచంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందన్నారు. త్వరలో తమ సంస్థ ద్వారా ప్రతిభ కలిగిన విద్యార్థులకు అండర్‌-15 ఫెలోషిప్‌ ప్రారంభించి 15వేల ఫెలోషిప్‌ అందచేస్తామని తెలిపారు.

Related posts