telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

ఇక అన్ని అత్యవరస సేవలకు .. కాల్ చేయండి.. 112కి ..తెలుగు రాష్ట్రాలలో కూడా..

112 is for all emergencies

అత్యవసర సేవలకు ఇప్పటి వరకు వివిధ ఫోన్ నంబర్లు అందుబాటులో ఉండగా, తాజాగా ఈ సేవలకు ఒకే నంబరు అందుబాటులోకి వచ్చింది. ఒక్కో సాయం కోసం ఒక్కో నంబరు అందుబాటులో ఉండడం వల్ల ప్రజలు తికమకపడుతుండడంతో స్పందించిన ప్రభుత్వం ఇప్పుడు 112ను అందుబాటులోకి తెచ్చింది. ఈ టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేయడం ద్వారా ఎటువంటి సమస్యకైనా సాయం పొందవచ్చు. ఈ సరికొత్త హెల్ప్‌లైన్ నంబరు ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అందుబాటులో ఉండగా, ఇప్పుడు మరిన్ని రాష్ట్రాలకు అందుబాటులోకి వచ్చింది. కేంద్రపాలిత ప్రాంతాలు సహా మొత్తం 20 రాష్ట్రాలకు ఇప్పుడీ నంబరును అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, కేరళ, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, గుజరాత్‌, పుదుచ్చేరి, లక్షద్వీప్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులు, దాద్రానగర్‌ హవేలి, డామన్‌ డయ్యు, జమ్ముకశ్మీర్‌, నాగాలాండ్‌ లలో ఈ నెంబర్ అందుబాటులోకి వచ్చిన రాష్ట్రాల్లో ఉన్నాయి. సాయాన్ని అర్థించే వ్యక్తులు 112 నంబరుకు ఫోన్ చేస్తే అది వారికి దగ్గరలోని నెట్‌వర్క్‌ టవర్‌ ఆధారంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌ (ఈఆర్‌సీ)కి అనుసంధానం అవుతుంది. దీని తో సంబంధిత అధికారులు సత్వరం స్పందించి సాయం అందిస్తారు.

Related posts