telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

వ్యాధులు రాకుండా కాపాడడంలో ‘పసుపు’ది అగ్రతాంబూలం

Turmeric

భారతీయ వంటకాలలో పసుపును విరివిగా వాడతారు. భారతీయ సంస్కృతిలో స్త్రీ సౌభాగ్యానికి పసుపుకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. అంతేకాదు పసుపు పారాణి మంగళకరమైనది. పూజ గదిలో, మంగళ స్నానాలలో, పెట్టుకునే బొట్టులో, చివరకు ఇంటిముందు వేసుకునే ముగ్గులో కూడా పసుపు ఉండాల్సిందే. ప్రతి ఇంట్లోని వంటింట్లో ఉండే పసుపుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
* పసుపుకు వేడి చేసే స్వభావం ఉంటుంది. కానీ పసుపు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.
* కడుపులో పెరిగే ఏలిక పాములను నిర్మూలిస్తుంది. నీళ్ళ విరేచనాలను తగ్గించే శక్తి పసుపుకు ఉంది.
* పచ్చ కామెర్ల వ్యాధికి అమోఘంగా పని చేస్తుంది. పసుపు వల్ల రక్తక్షీణత తగ్గి శరీరానికి రక్తం పట్టేలా చేస్తుంది. పసుపుకు నాలుగు రేట్లు పెరుగుని కలిపి రోజూ తింటే కామెర్లు తగ్గుతాయి. యితే వ్యాధి తీవ్రత, రోగి బలాన్ని బట్టి మోతాదును నిర్ణయించాలి. పూటకు 5 గ్రాములకు మించకుండా పసుపును తీసుకోవాలి.
* పసుపు కొమ్మును నిప్పుల మీద కొద్దిగా కాల్చి, నమిలితే పంటిపోటు తగ్గుతుంది. నోట్లో పుళ్ళు తగ్గి నోరు పరిశుభ్రం అవుతుంది.

Turmeric
* మధుమేహానికి పసుపు చక్కగా పని చేస్తుంది. మధుమేహం, అతిమూత్రాన్ని తగ్గించేలా చేస్తుంది. పెద్ద ఉసిరికాయలని బాగా ఎండబెట్టి, వాటిలోని గింజల్ని తీసేసి మెత్తగా దంచుకోవాలి. ఉసిరిక పొడికి సమానంగా పసుపు పొడిని కలిపి సీసాలో భద్రపరచాలి. ప్రతిరోజూ ఈ పొడిని 1/2 నుంచి స్పూన్ వరకు… మధుమేహం తీవ్రతను బట్టి తీసుకోవాలి. ఈ ఫార్ములాని “నిశామలకి చూర్ణం” అంటారు. ఈ పొడిని క్రమం తప్పకుండా వాడితే మధుమేహం తగ్గడమే కాకుండా వ్యాధిలో కాంప్లికేషన్స్ రావడం కూడా తగ్గుతుంది.
* ఎండిన పసుపు కొమ్ముని నిప్పుల మీద వేసి కాల్చి… ఆ పొగను మూర్ఛపోయిన వ్యక్తి పీల్చేలా చేస్తే త్వరగా కోలుకుంటారు.
* స్నానం చేసినా ఎక్కువగా చెమట పట్టి దుర్వాసన వచ్చే వాళ్ళు… పసుపు కొమ్ములు, వట్టి వేళ్ళు, కచ్చురాలు, బావంచాలు, పెసలు సమానంగా కలిపి మరపట్టించి సున్నిపిండిగా వాడితే శరీర దుర్వాసన, చెమట తగ్గుతాయి.
* పసుపు, వేపాకు కలిపి నూరి ఆ పేస్టును రాసుకుంటే మశూచి, గజ్జి, తామర మొదలైన వ్యాధుల్లో దురద, మంట తగ్గుతాయి.
* పసుపుపొడి, బెల్లం గోమూత్రంలో కలిపి పూటకు 5 గ్రాముల చొప్పున తీసుకుంటే బోదవ్యాది తగ్గుతుంది.
* నిప్పుల మీద పసుపు చల్లి ఆ పొగను తెలు కుట్టినచోట పడితే విష దోషం తగ్గుతుంది.

Milk
* పాలలో పసుపు పొడి, మిరియాల పొడి కలిపి రెండు పూటలా తాగితే జ్వరం, దగ్గు తగ్గుతాయి.
* వేడి నీళ్లలో పసుపు వేసుకుని ఆవిరి పడితే జలుబు, ముక్కులు బిగదీయడం వంటివి తగ్గుతాయి.
* వ్యాధులు రాకుండా కాపాడడంలో పసుపుకు అగ్రతాంబూలం ఇవ్వవచ్చు. అయితే దీన్ని అతిగా వాడితే వేడి చేయడమే కాకుండా జ్ఞుడేకు చెడును కల్గిస్తుంది. పసుపును అతిగా తీసుకుంటే విరుగుడుగా నారింజ, నిమ్మ, పంపరపనస విరుగుడుగా పని చేస్తాయి.

Related posts