telugu navyamedia
Uncategorized సినిమా వార్తలు

విశ్వవిఖ్యాత ఎన్.టి. రామారావు గారు నటించిన “మహామంత్రి తిమ్మరుసు” నేటికి 62 సంవత్సరాలు

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారు నటించిన చారిత్రాత్మక చిత్రం గౌతమి ప్రొడక్షన్స్ “మహామంత్రి తిమ్మరుసు” 26 జులై 1962 లో విడుదలయ్యింది.

అట్లూరి పుండరీకాక్షయ్య, నర్రా రామబ్రహ్మం లు నిర్మాతలుగా గౌతమి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రఖ్యాత దర్శకుడు కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే,: కమలాకర కామేశ్వరరావు కథ, మాటలు: పింగళి నాగేంద్రరావు, సంగీతం: పెండ్యాల, పాటలు: పింగళి నాగేంద్రరావు, ఫోటోగ్రఫీ: అన్నయ్య, కళ: గోఖలే, నృత్యం: వెంపటి సత్యం,ఎడిటింగ్: బి.కందస్వామి, సమకూర్చారు.

ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, గుమ్మడి, ఎస్.వరలక్ష్మి, దేవిక, ఎల్. విజయలక్ష్మి, మిక్కిలినేని, ప్రభాకరరెడ్డి, శోభన్ బాబు, రేలంగి , రాజశ్రీ, ధూళిపాళ, ముక్కామల, లింగమూర్తి, మహంకాళి వెంకయ్య, మాస్టర్ బాబు తదితరులు నటించారు.

ప్రముఖ సంగీత దర్శకుడు పెండ్యాల గారి స్వరకల్పనలో వచ్చిన పద్యాలు, పాటలు హిట్ అయ్యాయి.
“ప్రియవాణీ చరణకమల సన్నిధి”
“తిరుమల తిరుపతి వేంకటేశ్వరా”
“మోహనరాగ మహామూర్తి మంత మాయే”
“చరిత్ర ఎరుగని మహాపాతకం మా దేశానికే పట్టినదా”
వంటి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రం లోని “తెలుగు దేలయన్న దేశంబు తెలుగు” పద్యం తెలుగు భాష గొప్పదనాన్ని చాటిచెప్పింది.
ఈచిత్రంలో శ్రీకృష్ణదేవరాయలుగా ఎన్.టి. రామారావు గారు, మహామంత్రి తిమ్మరుసు గా గుమ్మడి పోటీపడి నటించారు.

కాగా ఈ సినిమా టైటిల్ విషయంలో నిర్మాతలు ఆలోచనలో పడటం జరిగింది. “మహామంత్రి తిమ్మరుసు” టైటిల్ ను ఎన్టీఆర్ గారు అంగీకరిస్తారా లేదా అనే సంశయం తో ఆయను అడుగగా ఇందుకు ఆలోచన ఎందుకు “మహామంత్రి తిమ్మరుసు” పేరునే ఖరారు చేయమని చెప్పారు.

శ్రీకృష్ణదేవరాయలు గా ఆ ఠీవీ, దర్పం, రాజసం,ఒక్క ఎన్టీఆర్ తప్ప వేరొకరివల్ల కాదని మరొక పర్యాయం ఈ సినిమా ద్వారా రుజువు అయింది.

ఈ సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కేంద్ర ప్రభుత్వ అవార్డు, రాష్ట్రపతి ప్రసంశాపత్రం లభించింది
అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఈ సినిమా ను రెండు పర్యాయాలు తిలకించారు.

చారిత్రాత్మక చిత్రాలలో ఒక మణిపూసగా నిలిచిన ఈ చిత్రం ఘనవిజయం సాధించి, విడుదలైన దాదాపు అన్ని కేంద్రాలలో 50 రోజులు, ఐదు కేంద్రాలలో
100 రోజులు విజయవంతం గా ప్రదర్శింపబడింది.
1. విజయవాడ — జైహింద్ టాకీస్ (102 రోజులు),
2. రాజమండ్రి — శ్యామల,(100 రోజులు)
మరియు మరొక మూడు కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడింది…..

Related posts