telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గ్రంథాలయాల అభివృద్ధిపై టార్గెట్ పెట్టుకుని 175 నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలు ప్రారంభిస్తాం: మంత్రి నారా లోకేశ్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధిపై శాసనసభ సభ్యులు మండలి బుద్ద ప్రసాద్ ప్రశ్నించారు.

ఈ విషయంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. సెంట్రల్ లైబ్రరీ గురించి కూడా ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడిన విషయాన్ని పేర్కొన్నారు. స్పీకర్ కోరినట్టు వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఉండాలని అన్నారు.

కేవలం మౌలిక వసతులు మాత్రమే కాకుండా మ్యానుస్క్రిప్ట్స్‌ను కూడా డెవలప్ చేయాలని అన్నారు. ఏపిలో లైబ్రరీల కోసం శోభా డెవలపర్స్ 100 కోట్లు ఇచ్చారన్నారు.

అనేక గ్రేడ్, జిల్లా లైబ్రరీలు ఉన్నాయని అన్నారు. అయితే, నేటి నుండి 24 నెలలు టార్గెట్ పెట్టుకుని సెంట్రల్ లైబ్రరీని ప్రారంభిద్దామని తెలిపారు.

ఆయా లైబ్రరీల్లో మినిమమ్ బుక్స్ అన్నీ ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. అన్ని లైబ్రరీలు ఇంటిగ్రేడ్ చేసి ఒక యాప్ ద్వారా వివరాలు ఇంట్లోనే కుర్చోని తెలుసుకునేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

100 రోజుల్లో ఈ యాప్‌ను కూడా ప్రారంభిస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు

జిల్లా గ్రంథాలయాలు 13 ఉన్నాయని, మరో 26 జిల్లా గ్రంథాలయాలను కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. సెస్‌ను నేరుగా గ్రంథాలయాల అకౌంట్‌లో వేసేలా డిప్యూటీ సీఎం, మంత్రి నారాయణతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని అన్నారు.

లైబ్రరీలకు స్టార్ రేటింగ్ ఇచ్చే విధానన్ని కూడా తీసుకొస్తామని తెలిపారు. కులం, మతం, ప్రాతాలకు అతీతంగా అందరూ కలసి ఒక చోట చేరే ప్రాంతం లైబ్రరీ అని వ్యాఖ్యానించారు.

పిల్లల్లో పుస్తకాలు చదవాలి అనే అలవాటు వస్తే ఫోన్లుకు దూరంగా ఉండే అవకాశం ఉంటుందని లోకేశ్ అన్నారు.

పుస్తక పఠనం వల్ల ఎంత మార్పు వస్తుందో దేవాన్ష్‌లో తాను చూశానని అన్నారు. చిన్నప్పడు తాను లైబ్రరీకి వెళ్లే వాడినని గుర్తు చేసుకున్నారు.

తన తనయుడు దేవాన్ష్ ఎప్పడూ పుస్తకాలు చదువుతాడని తెలిపారు. బ్రాహ్మణి లండన్‌లో అయిదు పుస్తకాలు కొంటే వాటిని అయిదు రోజుల్లో దేవాన్ష్ చదివేశాడని అన్నారు.

ఇక 175 నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలు ఉండాలని మంత్రి లోకేశ్ అన్నారు. మోడల్ లైబ్రరీ మంగళగిరిలో పెడుతున్నామని చెప్పారు. స్పీకర్‌ను లైబ్రరీ ప్రారంభోత్సవానికి పిలుస్తామని చెప్పారు.

ఎండాకాలం సెలవుల్లో ఎలాంటి యాక్టివిటీస్ పెట్టాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని అన్నారు.

సభికుల సూచనలతో లైబ్రరీలను దేశానికి మోడల్‌‌గా చేయాలంటున్నట్టు లోకేశ్ తెలిపారు.

Related posts