telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తాం: ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

ఉపఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్‌ అన్నారు.

వెంగళరావునగర్‌ డివిజన్‌ సిద్ధార్థ్‌నగర్‌ కమ్యూనిటీహాల్‌లో స్థానిక కార్పొరేటర్‌ దేదీప్య అధ్యక్షతన ఆదివారం రాత్రి దివంగత నేత మాగంటి గోపీనాథ్‌ సంతాప సభ జరిగింది.

మాగంటి కుమారుడు వాత్సల్యనాథ్‌, కుమార్తెలు అక్షర నాగ, దిషిరా, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి, రావుల శ్రీధర్‌రెడ్డి, సోహైల్‌ భాయ్‌, మాగంటి సోదరుడు మాగంటి వజ్రనాథ్‌, తదితరులు నివాళులర్పించారు.

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులను గోపీనాథ్‌ చేపట్టారని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్‌ అన్నారు.

థీమ్‌ పార్క్‌కు, కమ్యూనిటీ హాల్‌ కు మాగంటి గోపీనాథ్‌ పేరు పెట్టాలని స్థానికులు కోరుతున్నారని, జీహెచ్‌ఎంసీ జనరల్‌ బాడీ సమావేశంలో లెవనెత్తాలని ఆయన కార్పొరేటర్‌కు సూచించారు.

ఎన్టీఆర్‌ తరువాత కేసీఆర్‌ను మించిన నాయకుడు ఎవరూ లేరని తన భర్త దివంగత నేత, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఎప్పుడూ చెప్పేవారని ఆయన సతీమణి మాగంటి సునీత గోపీనాథ్‌ అన్నారు.

ఈ కార్యక్రమంలో దినేష్‌ చౌదరి, వై.రవి, వేణుగోపాల్‌, పవన్‌ ముదిరాజ్‌, కాలని అధ్యక్షుడు విజయ్‌ కుమార్‌, కోడె సాంబశివరావు, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Related posts