క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఛార్మీ కౌర్, కరణ్ జోహార్‌తో కలిసి పూరి నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ మారిందని టాక్. ఈ చిత్రానికి తొలుత ‘ఫైటర్’ టైటిల్ ఖాయం చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం తదితర భాషల్లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రెండు భాషల్లో ఈ టైటిల్ దొరకలేదట. కొన్ని అనివార్య కారణాల వలన సినిమాలో హీరో పేరు ‘లైగర్’ను టైటిల్‌గా ఖరారు చేశారట. ‘ఫైటర్’ బన్‌గయా ‘లైగర్’ (మగ సింహానికి, ఆడ పులికి పుట్టిన బిడ్డను లైగర్ అంటారు). ఈ మూవీలో అనన్యపాండే హీరోయిన్. అయితే.. అనన్యపాండేపై విజయ్ కామెంట్ చేశాడు. అనన్య పాండే చాలా గ్రౌండెడ్ గాళ్. అద్భుతమైన టాలెంట్ కలిగిన వ్యక్తి. రాబోయే రోజుల్లో అనన్య సూపర్ స్టార్ హీరోయిన్ అవడం ఖాయమని ఆకాశానికి ఎత్తేశాడు విజయ్. ఇక విజయ్ దేవరకొండ పొగడ్తలను ఫుల్ ఎంజాయ్ చేస్తోందట అనన్య.
							previous post
						
						
					
							next post
						
						
					

