telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లాక్‌డౌన్ పక్కనపెట్టి అంత్యక్రియల్లో పాల్గొన్న సేతుపతి

setupati

తమిళనాడులో సీనియర్ జర్నలిస్ట్, రచయత నెల్లాయ్ భారతి తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన శుక్రవారం కన్నుమూశారు. అంత్యక్రియల కోసం భారతి భౌతికఖాయాన్ని పోరూర్ లోని ఆయన ఇంటికి తరలించారు. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖుల ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు. అయితే లాక్‌డౌన్ నిబంధనలు ఉండటంతో అతి తక్కువమంది కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితులు హాజరై భారతికి తుది వీడ్కోలు పలికారు. భారతి.. అత్యంత సన్నిహితుడు కావడంతో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి సైతం అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. కుటుంబానికి ఆర్థికసాయం చేయడంతో పాటు అంత్యక్రియల ఖర్చును కూడా ఆయనే భరించారు. లాక్‌డౌన్ ఉన్నా కూడా సన్నిహితుడి కడ చూపు కోసం వచ్చిన విజయ్ సేతుపతిని పలువురు అభినందిస్తున్నారు.

Related posts