telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

లండన్ కోర్టులో విజయ మాల్యాకు ఊరట

Vijay malya

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో ఉపశమనం లభించింది. 114.5 కోట్ల పౌండ్ల బకాయీలు రాబట్టుకునేందుకు మాల్యాను దివాలాదారుడిగా ప్రకటించాలంటూ ఎస్బీఐ దాఖలు చేసిన కేసు విచారణ వాయిదాకు లండన్ కోర్టు అంగీకరించింది. సుప్రీంకోర్టులో వేసిన కేసులు, కర్నాటక హైకోర్టులో అప్పుల పూర్తి సర్దుబాటుకు దాఖలు చేసిన పిటిషన్లు పరిష్కారమయ్యేంత వరకు ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల బ్యాంకులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని జస్టిస్ బ్రిగ్స్ వ్యాఖ్యానించారు.

ప్రస్తుత దశలో దివాళా నిర్ణయం కోసం పట్టుబట్టడం వల్ల బ్యాంకులకు ఎలాంటి మేలు జరగదని పేర్కొన్నారు. ఈ దివాళా పిటిషన్ అసాధారణమైందని, భారత్‌లో అనేక వ్యవహారాలు కోర్టు పరిశీలనలో ఉన్నప్పుడు ఇలా బ్యాంకులు దివాళాకు పట్టుబట్టడం ఏమిటని విస్మయం వ్యక్తంచేశారు. ఈ సమయంలోకోవిడ్-19 వ్యాప్తి అనిశ్చితి కారంగా తేదీని నిర్ణయించడం కష్టమని విచారణను జూన్ 1 వ తేదీకి వాయిదా వేసింది.

Related posts