telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలయ్యకు జోడిగా ఆ ఇద్దరు హీరోయిన్లు ?

BB3

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వర్కింగ్ టైటిల్ “బిబి-3” పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన బీబీ 3 టీజర్‌కి మాస్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమాతో ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్, కరోనా కారణంగా వాయిదా పడగా, త్వరలోనే తిరిగి సినిమా షూటింగ్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వారణాసిలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ నెల 15 నుంచి బాలయ్య ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారట. ఈ సినిమాలో బాలయ్య సరసన మలయాళ భామ ప్రయాగ మార్టిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో ఈమెకు ఇదే తొలి సినిమా. ఈ సినిమాలో మరో హీరోయిన్‌ గా పూర్ణను సెలెక్ట్ చేసినట్టు సమాచారం. ఇప్పటివరకు చిన్న సినిమాలు మాత్రమే చేసిన పూర్ణకు ఇది మంచి అవకాశం. ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Related posts