తిరుమల…తిరుమల తిరుపతి దేవస్థానానికి ఓ అరుదైన గౌరవం దక్కింది. శ్రీవారి భక్తులకు ఉత్తమ సేవలు అందించినందుకుగానూ టీటీడీకి ఈ అవకాశం లభించింది. ఇంగ్లాండ్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్స్డ్ సంస్థ ఈ సర్టిఫికెట్‌ను అందజేసింది.
తిరుమల శ్రీవారి సన్నిధిలో టీటీడీ పాలక మండల అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థకు చెందిన సౌతిండియా సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఉల్లాజి ఈ సర్టిఫికెట్‌ని అందజేశారు.
దేశంలోని అత్యంత ధనవంతుడైన శ్రీవారి ఆలయానికి ఈ గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. దేశంలో ఏ దేవాలయానికి లేని గొప్పతనం శ్రీవారి ఆలయానికి ఉందని, నిత్యం వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటారని చెప్పారు. సాధారణ రోజుల్లోనే రోజూ సుమారు 70వేల మందికిపైగా భక్తులు వస్తారని, అయితే వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా టీటీడీ పాలక మండలి చూసుకుంటుందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
చక్రం తిప్పాలనుకున్న చంద్రబాబుకు కోలుకోలేని దెబ్బ: శివరాజ్‌సింగ్