తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈసీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఉత్తమ్ ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలను గుప్పించారు. ఎన్నికలకు కాంగ్రెస్ ఎప్పుడూ భయపడదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
విపక్షాలను ఇబ్బంది పెట్టడానికి టీఆర్ఎస్ కుట్రపన్నుతోందని విమర్శించారు. రిజర్వేషన్ల విషయం తేల్చక ముందే మునిసిపాలిటీ ఎన్నికలకు సమాయత్తమయిందని విమర్శించారు. సీఏఏపై సీఎం కేసీఆర్ తన వైఖరిని ఎందుకు వెల్లడించడంలేదని ప్రశ్నించారు. సీఏఏపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.