యంగ్ హీరో నితిన్ ఇటీవల ‘భీష్మ’ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. నితిన్ బ్యాక్ టు బ్యాక్ నాలుగు సినిమాల్లో నటించాల్సి ఉంది. ఇప్పటికే వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ సినిమాలో నటిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా టీజర్ ఇప్పటికే రిలీజ్ అయ్యింది. దీనితో మేర్లపాకా గాంధీ.. చంద్రశేఖర్ యెలేటి.. కృష్ణ చైతన్యల సినిమాలను కమిట్ అయ్యాడు నితిన్. త్వరలో తను నటించబోయే ఓ చిత్రానికి తన అభిమాన హీరో నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ఖుషీ’ని.. తన కెరీర్‌ను మలుపుతిప్పిన ‘దిల్’ చిత్రం టైటిల్స్‌ను కలిపి ‘దిల్‌ఖుషి’ పేరుతో ఓ చిత్రాన్ని చేస్తున్నట్లుగా తెలిసింది.ఈ సినిమా టైటిల్ ను పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ చేయబోతున్నాడని తెలుస్తుంది. ఇక నితిన్ ఈ టైటిల్ తో ఏ దర్శకుడితో చేయబోతున్నాడో చూడాలి. కాగా నితిన్ ఇటీవలే పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే.
next post

