టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. ఈరోజు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా మహారాష్ట్రలోని శ్రీ షిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు.
తరచుగా ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత రాజకీయ కార్యకలాపాలతో ముమ్మరంగా గడిపిన చంద్రబాబు, పోలింగ్ పూర్తయ్యాక పుణ్యక్షేత్రాల బాట పట్టారు.
చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి ప్రస్తుతం పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తున్నారు.
నేడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సతీసమేతంగా మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు నేడు కొల్హాపూర్ లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని కూడా సందర్శించారు.
టీడీపీ హయాంలో అమరావతి భజన: మంత్రి కొడాలి నాని