telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు సామాజిక

నేడే మేడే.. ఇంతకు మేడే అంటే ఏమిటి..? మే డే ఎలా మొదలైంది?

నేడు మేడే.. ఈ సందర్భంగా కార్మికులకు ప్రముఖులు మేడే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నేడు కార్మికులు మేడేను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

అయితే, మేడే అంటే ఏమిటి.. మేడే ఎలా మొదలైంది? అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి.

మే 1.. అంటే ‘మేడే’. దీన్ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా పిలుస్తారు. అమెరికాలో మాత్రం ప్రస్తుతం దీన్ని ‘లాయల్టీ డే’గా వ్యవహరిస్తున్నారు.

చాలా దేశాల్లో మే డేని సెలవు దినంగా పాటిస్తారు. ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో, సంఘటనకో ముడిపెట్టలేం.

కానీ 1886లో షికాగోలోని హే మార్కెట్‌లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు పునాది వేసిందని చెబుతారు.

అయితే..కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. కార్మికులకు 8 గంటల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

నాడు జరిగిన ఈ ఉద్యమానికి మద్దతుగా నాలుగు రోజుల తర్వాత షికాగోలోని హే మార్కెట్ లో భారీ ఉద్యమం నిర్వహించారు. ఆ ఉద్యమం ఉద్రిక్తంగా మారింది.

ఉద్యమం ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసులు కాల్పులు జరపడంతో అనేకమంది కార్మికులు తమ ప్రాణాలను కోల్పోయారు.

అయితే, ఈ మారణకాండను నిరసిస్తూ అనేక దేశాల్లో ఉద్యమాలు నిర్వహించారు. షికాగోలోని హే మార్కెట్లో ప్రాణాలర్పించిన కార్మికులను స్మరించుకుంటూ ప్రతి ఏటా మే 1న కార్మిక దినోత్సవంగా జరపుకుంటున్నారు.

1923 నుంచి ఇండియాలో మేడేను నిర్వహిస్తున్నారు. మేడేను ప్రతి ఏటా కార్మికులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. కార్మికుల ప్రాణత్యాగాలను నేడు గుర్తుచేసుకుంటారు.

ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించి కార్మికుల ఐక్యతను చాటుతారు. నేడే మేడే అనే పాటలను ఈ సందర్భంగా ఆలపిస్తుంటారు.

ఈ మేడే.. ఎన్నో ప్రజా ఉద్యమాలను స్మరించుకునేలా చేస్తుంది. ఎంతోమంది కార్మికులు పోరాటాలు చేసి, తమ రక్తాలను చిందించి కార్మిక హక్కులను సాధించారు.

ఒకప్పుడు కార్మికులు విశ్రాంతి లేకుండా పని చేయాల్సి వచ్చేది. ఈ క్రమంలో కార్మికులంతా కలిసి ఈ వెట్టిచాకిరి మేం చేయలేమంటూ ఎదురించి పోరాడి 8 గంటల పని విధానాన్ని తీసుకొచ్చారు. ఇది కార్మికులు సాధించిన విజయం.

Related posts