తెలుగుదేశం పార్టీ ఎంపీలను పార్టీ చీఫ్ చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి ఆహ్వానించారు. నేడు పార్టీ ఎంపీలతో భేటీకి ఏర్పాట్లు చేశారు.
శుక్రవారం ఢిల్లీలో మరోమారు జరగనున్న ఎన్డీఏ కూటమి భేటీలో చంద్రబాబు టీడీపీ ఎంపీలతో కలిసి పాల్గొంటారు.
ఎన్డీఏ కూటమి నేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ, ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ ఇప్పటికే టీడీపీ ఎంపీలకు ఆహ్వానం అందింది.

