telugu navyamedia
క్రీడలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి‌ని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన క్రికెటర్ తిలక్ వర్మ

ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా గెలుపులో తెలుగు యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ కీలక పాత్ర పోషించినాడు .

ఈ యువ క్రికెటర్‌పై క్రికెట్ దిగ్గజాల నుంచి రాజకీయ నేతల వరకు ప్రశంసలు వర్షం కురుపిస్తున్నారు.

కాగా మ్యాచ్ తర్వాత హైదరాబాద్‌కు చేరుకున్న ఈ క్రికెట్ హీరో మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి‌ని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి‌తో కలిసి తిలక్ వర్మ సీఎంను కలిశాడు. ఆసియా కప్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మను రేవంత్ రెడ్డి అభినందించారు.

అనంతరం చిరు సత్కారం చేశారు. ఆ తర్వాత తాను సంతకం చేసిన క్రికెట్ బ్యాట్‌ను తిలక్ వర్మ సీఎం రేవంత్ రెడ్డికి బహూకరించారు.

ఈ కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, శాట్స్ ఎండీ సోనిబాల దేవి, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిలక్ వర్మను ప్రశంసించారు.

ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌‌తో పిచ్‌ను పూర్తిగా తన కంట్రోల్‌లోకి తీసుకున్నాడన్నారు.

భారత జట్టును విజయపథంలో నడిపించాడని  ఒత్తిడిలోనూ అతని ప్రశాంతత, ప్రతిభ స్ఫూర్తిదాయకం అని అన్నారు.

 

Related posts