telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం

మున్సిపల్‌  ఫిబ్రవరిలో ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

సంక్రాంతికి ముందు లేదంటే ఆ తర్వాత షెడ్యూల్‌ ప్రకటించి నోటిఫికేషన్‌ ఇవ్వడానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలోగా ఎన్నికల తతంగాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించిన విషయం తెలిసిందే.

దీనికి సంబంధించి ఈ నెల 11 లేదా 20వ తేదీలోగా నోటిఫికేషన్‌ విడుదల చేయాలని భావిస్తోంది. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కసరత్తు మొదలు పెట్టాయి.

తెలంగాణలో గడువు ముగిసిన 117 మున్సిపాల్టీ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల సంఘం జనవరి 1న ముసాయిదా ఓటర్ల జాబితాను కూడా ప్రకటించింది.

ఈ నెల 10న తుది జాబితా వెలువరించనుంది. దీనికి అనుగుణంగా, మిగతా ప్రక్రియ సజావుగా సాగేలా పురపాలక పట్టణాభివృద్దిశాఖ సిద్ధమవుతోంది.

Related posts