తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా కేవలం తెలంగాణ గీతాన్ని మాత్రమే ఆవిష్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది.
అధికార చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై స్పష్టత రాలేదని తెలిపింది. 200 వరకు సూచనలు వచ్చినట్లు తెలిపింది.
మరిన్ని సంప్రదింపులు జరిపిన తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది.
ప్రజల పోరాటం, త్యాగాలు ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకోనున్నట్లు చెబుతున్నారు.
రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం, చార్మినార్ను తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఇది సరికాదని బీఆర్ఎస్ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి.
అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలి: కన్నా