వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.
నేడు నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామంలో ఎంపీ బైరెడ్డి శబరి పర్యటించారు.
దామగట్ల గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరి,జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ పాల్గొన్నారు.
ఐదేళ్లలో ఏమి చేశారో జగన్ ప్రజలకు చెబితే బాగుంటుందని అన్నారు.
అలా కాకుండా చిల్లర రాజకీయాలతో పాదయాత్ర చేస్తే జనం చెప్పులతో కొడతారని హెచ్చరించారు.
జగన్ ఐదేళ్లలో చేయని అభివృద్ధి కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే చేసి చూపించామని ఎంపీ బైరెడ్డి శబరి ఉద్ఘాటించారు.
ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు వివరించామని ఎంపీ బైరెడ్డి శబరి పేర్కొన్నారు.
తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని ఎంపీ బైరెడ్డి శబరి పేర్కొన్నారు.

