*కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం..
*సీపీసీవీ ఆనంద్‌ను కూర్చిలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్..
*పోలీస్ మ్యూజియాన్ని సందర్శించిన సీఎం
*ఒకే చోట లా అండ్ అర్డర్ సీసీఎస్
హైదరాబాద్ బంజారాహిల్స్ లో అతి భారీగా నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో దేశంలో అన్ని శాఖలను ఇంటిగ్రేట్ చేస్తూ నిర్మించడం జరిగింది. ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన భవన సముదాయం ఐదు టవర్ల రూపంలో నిర్మించారు.
600 కోట్లతో 20 అంతస్థుల్లో ఈ కమాండ్ కంట్రోల్ భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. 7 ఎకరాలు, 6.42 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరిగింది. భవనం ఎత్తు 83.5 మీటర్లు. టవర్ ఏ లోని 18వ ఫ్లోర్‌లో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉంది. 14, 15వ ఫ్లోర్‌లో మ్యూజియం, గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఏడో అంతస్తులో ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా కీలక విభాగాల అధిపతులకు ఛాంబర్లు ఉంటాయి. టవర్ బి మొత్తాన్ని టెక్నాలజీ వింగ్‌కు కేటాయించారు.
ఈ భవనంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నేరస్తుల కదలికలను పసిగట్టడం నేరాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా దోహదపడనుంది.
ఐసీసీసీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సీఎం కేసీఆర్‌కు ముందుగా పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు