ఈరోజు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు.
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. మొన్నటి వరకు ఎన్నికలపై దృష్టి పెట్టిన ఆయన పాలనపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై సమీక్షిస్తూ వచ్చారు.
పోలింగ్ ముగిసిన తర్వాత పలు శాఖల అధికారులతో సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే చాలా రోజుల తర్వాత కేబినెట్ భేటీ జరుగుతుండటంతో కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.
జగన్ గారూ మీరు ఏపీకి సీఎం.. సాక్షి పేపర్ చదవడం మానేయండి?: నారా లోకేశ్