telugu navyamedia
ఆంధ్ర వార్తలు

దూకుడు పెంచిన చిన‌బాబు..పంచ్ డైలాగ్స్‌తో వైసీపీకి వార్నింగ్‌

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దూకుడు పెంచారు. టీడీపీ ఆబిర్భావ దినోత్సవ వేడుక‌ల్లో వైసీపీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.. తన తండ్రి రాముడు కాబట్టి సాఫ్ట్ గా ఉన్నారని.. తాను మాత్రం వైసీపీ నేతలకు సినిమా చూపిస్తాను అంటూ హెచ్చరించారు.

తాత ఎన్టీఆర్ దేవుడు అని.. తన తండ్రి చంద్రబాబు రాముడు అని.. కానీ తాను మాత్రం మూర్ఖుడిని అంటూ హెచ్చరికలు చేశారు. చట్టాన్ని ఉల్లంఘించి టీడీపీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలను అధికారులను ఎట్టి పరిస్థితిలో వదిలేది లేదన్నారు. అమెరికా కాదు.. ఐవరీ కోస్టుకు వెళ్లినా ఎవరినీ వదిలి పెట్టేది లేదన్నారు.

వైపీపీ అధికారంలో ఉన్న ఈ రెండున్నరేళ్ల కాలం.. రాబోయే రెండేళ్లు కూడా ప్రతి విషయాన్ని గుర్తు పెట్టుటకుంటాను అన్నారు.

ఇటీవల వైసీపీ నేతల వ్యాఖ్యలతో తన పడ్డ బాధను కల్లారా చూశాను అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు పనులు చేసిన అధికారులను వదిలి పెట్టను అంటూ వార్నింగ్ ఇచ్చారు.

2024 నాటికి రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి మీద 2లక్షల అప్పు ఉండబోతోందని లోకేష్ హెచ్చరించారు. సమయం లేదు మిత్రమా..? ఇంకా రెండేళ్ల సమయం ఉంది.. ప్రజల్లోకి వెళ్లాలని తెలిపారు.

తెలుగు దేశం పూర్తిగా ప్రజల పార్టీ అన్నారు. జగనుది గాలి పార్టీ అంటూ ఎద్దేవ చేశారు. మహిళలకు ఆస్తిలో టీడీపీ సమాన హక్కు కల్పిస్తే.. ఆ హక్కు లేదంటూ తల్లిని – చెల్లిని జగన్ పక్క రాష్ట్రానికి తరిమేశారంటే ఆవేదన వ్యక్తం చేశారు.

 అమెరికా కాదు.. ఐవరీ కోస్టుకు వెళ్లినా ఎవరినీ వదిలి పెట్టేది లేదన్నారు. మాట్లాడినంత సేపు నారా లోకేష్ పంచ్ డైలాగ్ లు వేస్తూనే ఉన్నారు. ఇటీవల వైసీపీ నేతల వ్యాఖ్యలతో తన పడ్డ బాధను కల్లారా చూశాను అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు పనులు చేసిన అధికారులను వదిలి పెట్టను అంటూ వార్నింగ్ ఇచ్చారు. 

అధికారంలోకి వచ్చాక నాతో మాట్లాడాలంటే 12 కేసులుండాల్సిందే. 12 కేసులకంటే తక్కువగా ఉన్నాయంటే వైసీపీపై పోరాడ లేదని అర్ధం. గతంలో కేసులు పెట్టుకోవాలంటే కొంచెం నామోషీగా ఉండేది.. కానీ ఇప్పుడు కాలం మారింది. ముల్లును ముల్లుతోనే తీయాలి.. ఇప్పుడిలాగే ఉండాలి. రికార్డులు సృష్టించాలన్నా.. తిరగ రాయాలన్నా టీడీపీకే సాధ్యం…. ఇది సిల్వర్ స్క్రీన్ సింహా అల్లుడి సింహనాదం అంటూ పంచ్ డైలాగ్‌లు వేశారు.

టీడీపీది బ్రాండ్ కియా అయితే.. వైసీపీది కోడి కత్తి బ్రాండ్ అంటూ సెటైర్లు వేశారు. టీడీపీ పసుపు కుంకమ ఇస్తే.. వైసీపీ పసుపు కుంకమలు చెరిపేస్తోందని అన్నారు. ఫించన్ పెంచుకుంటూ పోతానన్న జగన్.. నిత్యావసరాల ధరలను పన్నులను పెంచుతూ పోతున్నారని గుర్తు చేశారు.

దేశంలో సంక్షేమానికి పునాది వేసింది ఎన్టీఆర్.. అభివృద్ధి చేసి చూపింది చంద్రబాబు. అన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది ఎన్టీఆర్. దేవుడు ఎన్టీఆర్.. రాముడు చంద్రబాబు అన్నారు .

 వైపీపీ అధికారంలో ఉన్న ఈ రెండున్నరేళ్ల కాలం.. రాబోయే రెండేళ్లు కూడా ప్రతి విషయాన్ని గుర్తు పెట్టుటకుంటాను అన్నారు. తెలుగు దేశం పూర్తిగా ప్రజల పార్టీ అన్నారు. జగనుది గాలి పార్టీ అంటూ ఎద్దేవ చేశారు. మహిళలకు ఆస్తిలో టీడీపీ సమాన హక్కు కల్పిస్తే.. ఆ హక్కు లేదంటూ తల్లిని – చెల్లిని జగన్ పక్క రాష్ట్రానికి తరిమేశారంటే ఆవేదన వ్యక్తం చేశారు. 

జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీకి ప్రతిపక్ష హోదా సాధించిన ఏకైక పార్టీ టీడీపీయేనని, జాతీయ స్థాయిలో ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభావం చూపిన వ్యక్తులన్నారు. పరిపాలనా కేంద్రీకరణ.. అభివృద్ధి వికేంద్రీకరణే టీడీపీ లక్ష్యంగా చెప్పారు.

తమ ప్రభుత్వం ప్రతి జిల్లాకూ భారీ పరిశ్రమలు తెచ్చామనే విషయాన్ని గుర్తు చేశారు. 1985లోనే మంగళగిరిలో టీడీపీ జెండా ఎగిరింది.. మళ్లీ 2024లో టీడీపీ జెండా ఎగరేసే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు నారా లోకేష్

.

Related posts