ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన అనంతరం ఆయన ఆపరేషన్ గాయానికి జీజీహెచ్లో వైద్యులు చికిత్స అందించారు. అధికారులతో కలిసి సుదీర్ఘ ప్రయాణం చేయడంతో ఆయనకు ఇటీవల జరిగిన ఆపరేషన్ గాయం పచ్చిగా మారిందని జీజీహెచ్ వైద్యులు నిన్న ప్రకటించారు.
ఆపరేషన్ గాయం నుంచి ఆయన ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. దీంతో ఆయనను ఎమర్జెన్సీ వార్డు నుంచి జీజీహెచ్ ఆసుపత్రిలోని రెండో అంతస్తులోని ఓ గదికి తరలించారు. ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఆయనను కలిసేందుకు ఎవరినీ అనుమతించట్లేదు. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి కూడా ఆయనను పరామర్శించేందుకు అనుమతి లభించక పోవడంతో ఆయన వెనుదిరిగారు.
తెలంగాణలో నడ్డా మాటలు కార్యరూపం దాల్చలేదు: పొన్నం ప్రభాకర్