నిరుద్యోగ యువకులు స్వయం ఉపాధి పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ సేవ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. టీ సేవ ఆన్లైన్ కేంద్రాల ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందేందుకు ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో బిల్లు కట్టడం, బస్, ట్రైన్, టికెట్లు బుక్చేయడం, వంటి అనేక రకాల సేవలను వినియోగదారులకు అందించడం ద్వారా అభ్యర్థులు స్వయం ఉపాధిని పొందవచ్చు.
స్వర్ణ తెంగాణ స్వయం ఉపాధి పథకం కింద దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు, దివ్యాంగులు, పదవీవిరమణ చేసిన సైనికులు, మహిళలకు ఫీజులో 25 శాతం రాయితీ ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించేందుకు ఆఖర్ తేదీ మార్చి30. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ www.tsevcetre.comలో సంప్రదించగలరు.
కేటీఆర్ ఫోన్ చేయగానే ఈటల తుస్సుమనిపించాడు: రేవంత్ రెడ్డి