సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్యం పాలయ్యారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ రాసినట్టు ఓ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. “2011లో నాకు కిడ్నీ సమస్య వచ్చింది. సింగపూర్లో వైద్యం చేయించుకున్నాను. అయితే 2016లో కిడ్నీ సమస్య తిరగదోడింది. అప్పుడు అమెరికా వెళ్లి కిడ్నీ మార్పిడి చేయించుకున్నాను. ఈ విషయం నా సన్నిహితులకు మాత్రమే తెలుసు. మరోవైపు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. నాకు కిడ్నీ మార్పిడి జరగడం వల్ల రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. దీని వల్ల నేను ఎవరిని కలుసుకోలేకపోతున్నాను. నాకు ప్రాణభయం ఏమీ లేదు” అని రాసి ఉంది. ఈ వార్తలపై తాజాగా రజనీకాంత్ స్పందించారు. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ నిజమేనని ఆయన తెలిపారు. కిడ్నీ సమస్య తలెత్తిందని చికిత్స చేయించుకున్నానని తెలిపారు. కానీ ఆ లేఖ రాసింది మాత్రం తాను కాదని అన్నారు. కాగా త్వరలో రజనీ మక్కల్ మంద్రం సభ్యులతో కలిసి చర్చించాక నేను రాజకీయ పార్టీకి సంబంధించి అఫీషియల్ ప్రకటన చేస్తాను అని తలైవా పేర్కొన్నారు.
							previous post
						
						
					
							next post
						
						
					

