telugu navyamedia
క్రీడలు

వన్డేలకు ఇమ్రాన్ తాహిర్ గుడ్ బై!

Imran Tahir To Retire
దక్షిణాఫ్రికా లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్  2019 ప్రపంచకప్ తర్వాత వన్డేల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించాడు. దేశంలో రానున్న  తరం స్పిన్నర్ల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ప్రపంచకప్ తర్వాత టీ20 మ్యాచుల్లో మాత్రం ఆడుతానని తెలిపాడు. పాకిస్థాన్ జాతీయుడైన తాహిర్ 2011 ఫిబ్రవరి 24న వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా తరపున వన్డేల్లో ఆరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 95 వన్డేలు ఆడిన ఆయన 156 వికెట్లు తీశాడు. 146 పరుగులు చేశాడు. 2016లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో 45 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా తరపున వేగంగా 100 వికెట్లు తీసిన రికార్డు కూడా తాహిర్ ఖాతలోనే నమోదైంది. ఇప్పటి వరకు రెండు వన్డే ప్రపంచకప్ లు, రెండు టీ20 ప్రపంచకప్ లో  తాహిర్ ఆడాడు.

Related posts