లాక్ డౌన్ నేపథ్యంలో సెలెబ్రిటీలంతా తమ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా శృతి హాసన్ తనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అందులో ఓ నెటిజన్.. మీ తండ్రి మీకిచ్చిన వరెస్ట్ పనిష్మెంట్ ఏంటని అడగ్గా.. మా నాన్న ఇంతవరకు నన్ను తిట్టలేదు. కొట్టలేదు. ఆయన అలాంటి వారు కాదు. ఆయన ఎప్పుడూ లాజిక్‌గా ఉంటారు. అయితే ఓ సారి తప్పు చేసినప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయ్యా అని మాత్రమే చెప్పారు అని కామెంట్ పెట్టారు. ఇక లాక్‌డౌన్ తరువాత మీరు చేసే మొదటి పని ఏంటని అడిగిన ప్రశ్నకు.. నేను కచ్చితంగా షూటింగ్స్‌కు వెళతాను. షూటింగ్‌లను నేను చాలా మిస్ అవుతున్నా. అయితే అంతా సురక్షితంగా ఉన్నప్పుడే షూటింగ్‌లకు వెళతా అని పేర్కొంది. ఇక పవన్ కల్యాణ్ సరసన ఆమె నటించిన గబ్బర్ సింగ్ 8 సంవత్సరాలను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మాట్లాడిన శృతి.. ఆ సూపర్ హిట్ మూవీలో నేను భాగం అవ్వడం నా అదృష్టం. ఆ సినిమా నన్ను చాలా మార్చింది అని కామెంట్ పెట్టారు. కాగా శృతి ప్రస్తుతం తెలుగులో పవన్ సరసన వకీల్ సాబ్, రవితేజ సరసన క్రాక్‌లో నటిస్తున్నారు.
previous post


అందుకే ఆర్ఆర్ఆర్ కోసం ఆ హీరోను తీసుకున్నా… రాజమౌళి