తెలుగులో పరుగు, మస్కా, అదుర్స్ వంటి చిత్రాల్లో నటించిన షీలా వ్యాపారవేత్త సంతోష్ రెడ్డిని పెళ్లాడారు. చెన్నైలో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. కాగా పూవే ఉనక్కగ అనే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం అయిన షీలా.. హీరోయిన్‌గానూ పలువురి స్టార్ల సరసన నటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో దాదాపుగా 24 చిత్రాల్లో ఆమె కనిపించింది. తెలుగులో చివరగా బాలకృష్ణ నటించిన పరమ వీర చక్ర అనే మూవీలో షీలా నటించింది.
							previous post
						
						
					
							next post
						
						
					

