telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టాలీవుడ్ లో మరో విషాదం… సీనియర్ నటుడు కన్నుమూత

Manchala Suryanarayana

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు మంచాల సూర్యనారాయణ (72) గుండెపోటుతో కన్నుమూసారు. హైదరాబాద్ లోని ఎర్రగడ్డ రాజీవ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఈయనకు భార్య ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. నిన్న ఛాతిలో నొప్పి రావడంతో సూర్యనారాయణ ను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ ఆలోపే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. వెండితెర పైన పలు సినిమాల్లో, బుల్లితెరపై సీరియల్స్ లో కూడా నటించారు సూర్యనారాయణ. సూర్యనారాయణ మొట్టమొదట 1988 లో వచ్చిన ‘వివాహభోజనంబు’ అనే సినిమాలో నటించారు. లాక్ డౌన్ అనంతరం షూటింగ్స్ ప్రారంభమైన తర్వాత కూడా ఈయన సీరియల్ షూటింగ్స్ లో పాల్గొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Related posts