మహిళకు పురుటి నొప్పులు రావడంతో దుబాయ్ నుంచి మనీలా వెళుతున్న సీబు పసిఫిక్ ఎయిర్‌లైన్స్ విమానం శనివారం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అధికారుల వివరాల మేరకు. విమానంలో పిలీప్పీన్స్ దేశానికి చెందిన సెరీడా అనే మహిళకు ఆకస్మాత్తుగా పురుటి నొప్పులు రావడంతో విమానాన్ని శంశాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు వారు తెలిపారు. శంషాబాద్ నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్స్‌లోనే మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం విమానం గమ్యస్థానానికి బయలుదేరింది.
							previous post
						
						
					
							next post
						
						
					


చంద్రబాబు రాజధానికి ఓ అడ్రస్ లేకుండా చేశారు: మంత్రి బొత్స